హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజాం బ్యాంకులో అగ్నిప్రమాదం!

VZM: రాజాం-పాలకొండ రోడ్డులోని ఇండియన్ బ్యాంకులో నిన్న రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకు నుంచి పొగలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజాం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.