హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాము కాటుతో వ్యక్తి మృతి

AKP: ఎలమంచిలి ధర్మవరం బైపాస్ రోడ్డు సమీపంలో ఇంట్లో సామాన్లు సర్దుతుండగా పాము కాటేయడంతో చిక్కాల సురేశ్ (37) మృతి చెందాడు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.