హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్‌లో మురుగుతో స్థానికుల ఇబ్బందులు

NRML: ఆదర్శనగర్ శిశుమందిర్ ఎదుట వేపచెట్టు ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న ఇంటి సమీపంలో మురుగునీరు నిలిచిపోయింది. నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు తెలిపారు. మురుగునీటితో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.