హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో గంజాయి విక్రేత అరెస్ట్

TPT: తిరుపతిలో ఆదివారం ఉదయం గంజాయి విక్రయిస్తున్న కొర్లగుంట హేమంత్ రెడ్డి అనే నిందితుడిని SVU పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డులో విక్రయాలు జరుపుతుండగా పట్టుబడిన నిందితుడి నుంచి కేజీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు అతనికి రిమాండ్ విధించారు.