హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో పోక్సో కేసు నమోదు

GNTR: గుంటూరులో ఇంటర్ విద్యార్థినికి డబ్బుల ఆశ చూపి, విలాసాలకు అలవాటు చేసి వ్యభిచారంలోకి దించిన దారుణం వెలుగు చూసింది. పాతగుంటూరుకు చెందిన మహిళ మరొకరితో కలిసి రెండు నెలలుగా ఈ చర్యలకు పాల్పడుతుండగా, గమనించిన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.