హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 28,531 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

KRNL: జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు 28,531 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఇందులో డ్రంకెన్ డ్రైవింగ్ 5,972, ఓపెన్ డ్రింకింగ్ 10,670, ఓవర్‌స్పీడ్ 5,839, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ 4,094 కేసులు ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.