హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యావరణ పరిరక్షణకు ఈ-చెత్త వాహనాలు!

KRNL: కల్లూరులోని మాధవి నగర్ క్యాంపు కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 10 ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను శనివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడంతో పాటు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ఈ వాహనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజలు ఈ-చెత్త సేకరణ వాహనాలను ఉపయోగించుకోవాలన్నారు.