అనకాపల్లి జిల్లాలో 77 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో 62, పట్టణ ప్రాంతాల్లో 15 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణులైన 25–45 ఏళ్ల మహిళలు అర్హులు. సెప్టెంబరు 6 నుంచి 15 వరకు సంబంధిత PHC/UPHCల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత ఉన్న మహిళలు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆశా వర్కర్ పోస్టుల భర్తీ


