హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు ఆదివారం హైదరాబాద్ వాస్తవ్యులు నరసింహం, రుక్మిణి, అవినాష్ కుమార్ వారి కుటుంబ సభ్యులు రూ. 1,00,116 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ సిబ్బందికి అందజేశారు. అనంతరం సిబ్బంది దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.