SKLM: ఎచ్చెర్ల మండలం దోమాం పంచాయతీ మెట్ట పేట సమీపంలోని తోటల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి రూ.12 వేల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఐ జి. లక్ష్మణరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై దాడి


