హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో గ్యాస్ వినియోగదారులకు అలర్ట్

SKLM: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల ఈకేవైసీకి సోమవారంతో గడువు ముగియనుంది. ఈకేవైసీ చేయకపోతే సబ్సిడీ నిలిచిపోవడంతో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగొచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినందున ఈసారి మరో అవకాశం ఉండకపోవచ్చన్నారు. వినియోగదారులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కోరింది.