హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే కాన్పులో మూడు దూడల జననం

AKP: అచ్యుతాపురం మండలం మడతూరు గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పిల్ల నరసకు చెందిన ఆవు ఒకే కాన్పులో 3 దూడలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఒకే కాన్పులో ఒక దూడ పుట్టడం సహజం. కాగా మూడు దూడలు పుట్టడంతో ఈ విషయం గ్రామంలో ఆసక్తికరంగా మారింది. 3 దూడలు ఆరోగ్యంగా ఉండటంతో రైతు కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఆ దూడలను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తిగా తరలివస్తున్నారు.