హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాణాలు మీదకు తెచ్చిన రాంగ్ రూట్!

PLD: మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్‌లో శనివారం గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణానికి చెందిన అనిల్‌కుమార్ అంబేడ్కర్ సెంటర్ వైపు వస్తుండగా రాంగ్‌రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అనిల్‌కుమార్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు.