హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్రీ విజయగణపతి వార్షికోత్సవం

ప్రకాశం: ఒంగోలు శ్రీనగర్ కాలనీలోని శ్రీ విజయ గణపతి దేవస్థానంలో 9వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. సుప్రభాతంతో ప్రారంభమైన కార్యక్రమాల్లో విశేష అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, గణపతి హోమం, పూర్ణాహుతి, శిఖర సంప్రోక్షణ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.