హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని వ్యక్తి మృతి

AKP: అనకాపల్లి–బయ్యవరం మధ్య రైల్వే ట్రాక్‌పై శనివారం రైలు ఢీకొని వ్యక్తి చెందినట్లు రైల్వే ఎస్సై కేటీఆర్ లక్ష్మి తెలిపారు. వయసు 40-45 ఏళ్ల మద్య ఉంటుందన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అనకాపల్లి ఎన్‌టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. మృతుడి వద్ద లభించిన ఏపీఎస్‌ఆర్టీసీ పాస్‌లో జయ్య భాస్కరరావు, కశింకోట చిరునామా ఉన్నట్లు గుర్తించామన్నారు.