హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపేటలో రూపు దిద్దుకున్న పంచముఖ విగ్రహం

కోనసీమ: మండపేటకు చెందిన శిల్పి వాసా శ్రీనివాస్‌ రూపొందించిన పంచముఖ దక్షిణామూర్తి విగ్రహాన్ని శనివారం కోటప్పకొండకు తరలించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్ఠించేందుకు రాగి, వెండి, బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. సుమారు 40 రోజులపాటు శ్రమించి శిల్పి విగ్రహాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు.