కోనసీమ: అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో కుక్కకాటు బాధిత చిన్నారులకు సరైన వైద్యం అందించకుండా రిన్ సబ్బుతో గాయాలు కడిగారని వైసీపీ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడసకుర్రుకు చెందిన బాధిత చిన్నారులను శనివారం పరామర్శించారు. ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఘటనపై అధికారులను నిలదీసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డ వైసీపీ ఇంఛార్జ్


