KDP: వీబీజీ రామ్ ఫీల్డ్ అసిస్టెంట్ టి. నారాయణను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు కలసపాడు ఎంపీడీవో మహబూబ్బీ తెలిపారు. ఈ మేరకు జిల్లా పీడీ ఆదిశేషారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. డిజిటల్ లావాదేవీల వివరాలు, వీబీజీ రామ్ పనుల్లో అవకతవకలు, ఇతర అవినీతి ఆరోపణలపై పీడీకి నివేదిక సమర్పించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వీబీజీ రామ్ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్


