KDP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ నరసాపురం పార్లమెంట్ సహాయక బృందం సభ్యుడిగా పాలకొల్లుకు చెందిన తులా రామలింగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. పార్టీ విధివిధానాలు, కూటమి పక్షాలతో సమన్వయాన్ని వీరు పర్యవేక్షిస్తారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన జనసేన అధినేత పవన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన సమన్వయకమిటీలో ఎంపిక


