హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతపల్లిలో వెలగని హైవే సౌర విద్యుత్ దీపాలు

ASR: చింతపల్లిలో 516-ఈ హైవేపై సౌర విద్యుత్‌ దీపాలు వెలగక రాత్రివేళ చీకట్లు అలుముకుంటున్నాయి. జెడ్పీ అతిథి గృహం నుంచి టీ జంక్షన్‌ వరకు ఏర్పాటు చేసిన 29దీపాల్లో 21పూర్తిగా పనిచేయడం లేదు. మిగిలిన 8దీపాలు కూడా అంతంత మాత్రంగానే వెలుగుతున్నాయి. దీంతో రాత్రివేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై మూగజీవుల సంచారం ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరిగింది.