హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సై అవతారమెత్తి వసూళ్లు.. వ్యక్తి అరెస్ట్..!

కృష్ణా: హనుమాన్‌ జంక్షన్‌లో ఎస్సై నటిస్తూ వాహనదారులను బెదిరించి రూ. 6,000 నగదు తీసుకున్న కేసులో దుర్గాంజనేయులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ రమేశ్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐ ఎం. శ్రీనివాసు, సిబ్బంది వేలేరు క్రాస్‌రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.