హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోపిదేవి పీహెచ్‌సీని తనిఖీ చేసిన DMHO

కృష్ణా: మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO దయాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని వైద్య సేవలు, రోగులకు అందుతున్న సదుపాయాలు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు.