హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువుల ఆక్రమణలపై ఆర్డీవో కుమార్ పరిశీలన

NTR: విస్సన్నపేట మండలం కొండపర్వలో జానకట్ట, బత్తుల చెరువుల ఆక్రమణలపై ఆర్డీవో కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల పరిధి, హద్దులు, ఆక్రమణలను పరిశీలించి పూర్తి వివరాలు గుర్తించాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు.