హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడల్లో వీరన్నపేట విద్యార్థుల సత్తా

SDPT: చేర్యాల మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడల్లో జెడ్పీహెచ్‌ఎస్ వీరన్నపేట విద్యార్థులు ఘన విజయం సాధించారు. అండర్‌-14 బాలికల కబడ్డీలో ప్రథమ, ఖో-ఖోలో ద్వితీయ, అండర్‌-17 బాలుర కబడ్డీలో ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. విజేతలను హెచ్‌ఎం సమ్మయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు.