హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురువు ముందు శిష్యుడిగానే.. ఎమ్మెల్యే

BDK: పినపాక మండలంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన చిన్ననాటి గురువు ఎర్రప్రగడ రామ్మూర్తిని కలిశారు. గురువుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం శాలువాతో సన్మానించారు. గురువుల సేవలను ఎప్పటికీ మర్చిపోనని ఎమ్మెల్యే తెలిపారు.