హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమలయపాలెంలో శ్రీకృష్ణ పరమాత్మ పల్లకి ఊరేగింపు

KMM: తిరుమలాయపాలెం మండల కేంద్రంలో శ్రీ కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని శనివారం ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక ఖమ్మం శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరమాత్మ పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పురవీధులు శ్రీకృష్ణ పరమాత్మ నామస్మరణతో మారుమోగాయి. ఈ వేడుకల్లో మహిళలు ఆడిన కోలాటం స్థానికులను ఆకట్టుకుంది.