హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయులకు సన్మానం

PDPL: ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఎస్టీ మినీ గురుకులం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షుడు చింతపండు నర్సింగం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని నర్సింగం తెలిపారు. ప్రిన్సిపల్ శ్రీలత, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.