హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుడు భావితరాలకు మార్గదర్శకులు: SFI

HNK: పరకాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు SFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. SFI జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు భావితరాలకు మార్గదర్శకులుగా నిలుస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.