MDK: కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని బీఆర్‌ఎస్ నాయకులు, 16వ వార్డు ఇన్‌చార్జ్ బుక్కా విజయ్‌కుమార్ పేర్కొన్నారు. తూప్రాన్‌లో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బాకీ కార్డులను వార్డుల్లో పంపిణీ చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలను అమలు చేయలేదని వివరించారు. నాయకులు అహ్మద్, మహమ్మద్, నర్సింహులు పాల్గొన్నారు.
తెలంగాణ
'మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్'


