హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీఎం సభ.. ప్రయాణికుల అవస్థలు!

NLG: నకిరేకల్‌లో సీఎం సభ కోసం ఆర్టీసీ బస్సులను తరలించడంతో నల్గొండ బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో బస్టాండ్‌లో రద్దీ పెరిగిపోయింది. గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.