హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్ధులగుట్ట జాతరకు సర్వం సిద్ధం

RR: శంషాబాద్ చారిత్రాత్మక సిద్ధులగుట్ట జాతర మహోత్సవాలను 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఈవో మల్లేశ్ తెలిపారు. జాతరకు సుమారు 30 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు. భక్తుల సౌకర్యార్థం 40 క్వింటాళ్ల బియ్యంతో అన్నదానం, తాగునీరు, క్యూ లైన్లు వంటి మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.