హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంగిపోయిన రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

HYD: హుస్సేనీ కోఠి రోడ్డులోని డ్రైనేజీ కాలువ కుంగిపోవడంతో ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. లోపలి డ్రెయినేజీ బయటపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహ్రాజ్, జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.