హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి ఆరుగురు అరెస్ట్

BDK: లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ప్రభుత్వ వైద్యుడు, సింగరేణి, కేటీపీఎస్‌ ఉద్యోగులు, న్యాయవాది ఉన్నట్లు సమాచారం. వారి వద్ద సుమారు రూ.70 వేల వరకు ఫోన్‌పే లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.