హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి కేఎంసీలో సీటు

JN: లింగాలఘణపురం మండలం జీడికల్ గ్రామానికి చెందిన నల్ల శ్వేత నీట్‌లో ర్యాంకు సాధించి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందింది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, జఫర్‌గఢ్ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ఆమె లాంగ్‌టర్మ్ కోచింగ్‌తో ఈ విజయం సాధించింది. శనివారం శ్వేతను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.