SRD: జిల్లాలో మహా పుణ్యశైవక్షేత్రంగా పేరొందిన ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకి ఆలయంలో శనివారం విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణమాసం, కృష్ణ పక్షం, నవమి, స్థిర వాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
కేతకి సంగమేశ్వర స్వామికి పూజలు


