హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటన

VKB: ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్ వీర్లపల్లి శంకర్ ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఉత్తమ, విశ్రాంత ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. 11.45 గంటలకు షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఎమ్మెల్యే పర్యటన వివరాలను వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.