హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండాలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవం

NRML: లోకేశ్వరం మండలం నర్సింహనగర్‌ తండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ శుక్రవారం ప్రారంభించారు. మరో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.