హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

MHBD: దొంగతనం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం గార్ల మండలం మర్రిగూడెం క్రాస్‌రోడ్డు వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న చింత యుగంధర్, బోడ సాంబశివరావులను పట్టుకుని విచారించారు. వారి వద్ద నుంచి విదేశీ కరెన్సీ నాణేలు, రూ.2,400 నగదు, బంగారు మంగళసూత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.