హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్లేడ్ ముక్కలు మింగిన బాలుడు

HYD: హైదరాబాద్‌కు చెందిన ఓ బాలుడు నాలుగు బ్లేడ్ ముక్కలు మింగడంతో ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన బాలుడికి ఎక్స్‌రేలో బ్లేడ్ ముక్కలు గుర్తించారు. డాక్టర్ బి. రమేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఎండోస్కోపీ చేసి బ్లేడ్ ముక్కలను సురక్షితంగా తొలగించింది. బాలుడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.