హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్లు తొలగిస్తున్న ట్రాక్టర్ సీజ్

BHPL: మహాముత్తారం మండలం కేశవాపూర్ బీట్‌లో అడవిలో చెట్లను తొలగిస్తున్న ట్రాక్టర్‌ను అటవీశాఖ అధికారులు పోలీసుల సహాయంతో స్వాధీనం చేసుకుని శుక్రవారం సీజ్ చేశారు. గత నెల 15న రెండు ట్రాక్టర్లతో చెట్లను తొలగిస్తుండగా అధికారులు అడ్డుకోగా, కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడి ట్రాక్టర్లను తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.