హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

SDPT: బెజ్జంకి మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వేడుకల్లో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో బెజ్జంకికి చెందిన లింగాల గణేష్ బృందం విజయం సాధించింది. నిర్వాహకులు బృందానికి రూ.10,116 నగదుతో పాటు మెమెంటో అందజేశారు. అంతకుముందు వివిధ పాఠశాలల చిన్నారుల నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.