హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్లుడిపై మామ దాడి.. కేసు నమోదు

HNK: కాజీపేట మండలం మడికొండ కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడిపై మామ కర్రతో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. సంగెం మండలం చింతలపల్లికి చెందిన రాయబరపు రాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సుల్తాన్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ తెలిపారు.