హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా బాలరాజు

MDCL: మేడ్చల్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జగద్గిరిగుట్టలోని సంస్కృతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డమీది బాలరాజు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆయనను సత్కరించనున్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు.