హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీమంత్రి అనిల్ కుమార్ అనుచరుడిపై కేసు నమోదు

నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్‌లో మాజీమంత్రి అనిల్ కుమార్ అనుచరుడిపై కేసు నమోదైంది. ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ. 5 లక్షల డిమాండ్ చేశారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. దీంతో అనిల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది.