హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో ప్రోటీన్ కిట్లు అందజేత

E.G: రాజమహేంద్రవరం నటరాజ్ థియేటర్ వి.వి. గార్డెన్స్‌లో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో 300 మంది గర్భిణులకు సామూహికంగా సీమంతం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు తల్లి, బిడ్డ ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన ప్రోటీన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య దృష్ట్యా కిట్లు అందిస్తున్నామన్నారు.