కోనసీమ: పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.2.78 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ పనులకు ప్రభుత్వం రూ.1 కోటి మంజూరు చేసిందని తెలిపారు. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత: MLA


