హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: ఎస్పీ

TPT: తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. 2,500 నుంచి 3,000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.