హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాదవుల ఐక్యత చాటిన కృష్ణాష్టమి వేడుకలు

కృష్ణా: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మచిలీపట్నం యాదవ సేన ఆధ్వర్యంలో “మేము సైతం” సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర బైక్ ర్యాలీని ప్రారంభించారు. 100 మందికి పైగా యాదవ సోదరులు పాల్గొన్నారు. 13 పేద యాదవ కుటుంబాలకు 325 కేజీల బియ్యం పంపిణీ చేసి, 150 మందికి విందు ఏర్పాటు చేశారు. భాస్కరపురంలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.