PPM: ఎల్విన్‌పేట గ్రామ పరిసరాల్లో భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనకు గురిచేసింది. కొండచిలువను గుర్తించిన గ్రామస్తులు అప్రమత్తంగా వ్యవహరించి చాకచక్యంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అటవీ ప్రాంతానికి సమీప గ్రామాల్లో తరచూ పాములు సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్విన్‌పేటలో కొండచిలువ కలకలం


