హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటు హక్కు వినియోగించుకోవాలి'

ASR: సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాట్రగెడ్డ గ్రామంలో శుక్రవారం సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.